ఆగస్టు 16 2025, ఈ తరం భారతం హైదరాబాద్ :శ్రీకృష్ణుడు మథుర, ద్వారక, బృందావనం, ఉడుపి, పూరీ, గురువాయూరు వంటి ప్రసిద్ధ క్షేత్రాలలో వెలిశాడు. వారణాసిలో బిందుమాధవుడు, ప్రయాగలో వేణుమాధవుడు, పిఠాపురంలో కుంతీమాధవుడు, రామేశ్వరంలో సేతుమాధవుడు, తిరువనంతపురంలో సుందర మాధవుడిగా దర్శనమిస్తాడు. శ్రీకృష్ణుడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు, రాజనీతి నిపుణుడు, తత్త్వవేత్త, విజయ రథసారథి, గీతా బోధకుడు, సన్మార్గదర్శి, గ్రహ దోష నివారకుడు, భక్త వరదుడు, ఆపన్న శరణ్యుడు, జగద్గురువుగా కీర్తించబడ్డాడు.















