ఈతరం భారతం ఫిబ్రవరి 4 హైదరాబాద్ :
షిరిడీలోని 369 ఎకరాల స్థలంలో 108 అడుగుల శ్రీ శిరిడి సాయిబాబా విగ్రహాన్ని ఏర్పాటుకు సంబందించిన భారత్ వేధిక్ పర్యటన్ నిగం లిమిటెడ్ రూపొందించిన బ్రోచర్ ను ఆవిష్కరణ కార్యక్రమం పూజ్యా గురుదేవ్ రామదూత స్వామి చేతులమీదుగా జరిగింది. ఈ కార్యక్రమం కంపెనీ సభ్యులు పతిపాక సుదర్శన్, సంజయ్ బహురావ్ మగర్, విడియాల సంజయ్ కుమార్, అయ్యోద్య మందిర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మనిదీప్ లు పాల్గొన్నారు. లు పాల్గొన్నారు.ఈ సందర్బంగాశ్రీ శ్రీ రామదూత గురూజీ మాట్లాడుతూ భారత్ వేదిక్ పర్యటన నిగం లిమిటెడ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను చూసి ఆశీర్వాదాలు అందజేశారు ఇలాంటి కార్యక్రమం 27 రాష్ట్రాల్లో కూడా చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. షిరిడీలోని 369 ఎకరాల స్థలంలో 108 అడుగుల శ్రీ శిరిడి సాయిబాబా విగ్రహాన్ని ఏర్పాటుకు ముందుకు వచ్చిన భారత్ వేదిక్ పర్యటన నిగం లిమిటెడ్ వారిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు ఈ స్థలంలో 108 రకాల బాబా విగ్రహాల తో కూడిన గ్యాలరీ మ్యూజియం, లేజర్ షో ,వేదిక్ సైన్స్, టూరిజం రిసార్ట్స్, స్పోర్ట్స్ స్టేడియం ,ఆవుతో తో చేసిన వ్యవసాయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు అలాగే 18 పీఠాల కుటీరాలను వేద పాఠశాలను ఏర్పాటు చేయాలని రామదూత గురూజీ గారు నిర్వాహకులకు సూచించారు అంతేకాకుండా ఆర్యవైశ్య కమిటీ ముందుకు వచ్చి 102 ఎకరాల స్థలంలో 102 అడుగుల వాసవి కన్యకా పరమేశ్వరి మాత విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినట్లు వారు తెలిపారు. గౌడంగ్ విలేజ్లో 108 అడుగల శ్రీ షిర్టీ సాయిబాబా విగ్రహన్ని ఏర్పాటు చేయనున్న నేపధ్యంలో భారీ ఏర్పాట్లు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.















