ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 24
ఇటీవల గత కొంతకాలం గా కొంత మంది షిరిడీ సాయిబాబా పై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను మరియు శ్రీ సాయిబాబా భక్తులను కించ పరుస్తూ, దుర్భాషలాడిన విషయాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలోని శిరిడీ సాయి భక్త సంఘాల వారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు ఎన్ రాంచందర్ రావు దృష్టికి తీసుక వచ్చారు. వాటిని పరిశీలించిన పిమ్మట అధ్యక్షులు అత్యంత ఆశ్చర్యానికి గురి అయినారు. త మంది షిరిడీ సాయిబాబా పై చేసిన అనుచిత వ్యాఖ్యలన్నిటిని బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని అన్నారు . ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు బీజేపీ పార్టీ విధానాలకు పూర్తి వ్యతిరేకం అని వారు స్పష్టం చేశారు. బిజెపి పార్టీ సమాజంలో ఐక్యతని, మతసామరస్యాన్ని, దేశభక్తిని పెంపొందించే విధంగా పనిచేస్తుంది కానీ, వ్యక్తుల మధ్య ప్రాంతాల మధ్య విభేదాలను ఎప్పటికీ సమర్థించదు అన్నారు.కొంత మంది చేసిన వ్యాఖ్యలను వ్యక్తిగతమైన వ్యాఖ్యలుగా బిజెపి పార్టీ భావిస్తుంది అని కోట్లాది మంది షిరిడీ సాయిబాబా భక్తుల మానో భావాలను కించపరిచే విధంగా కొంత మంది చేస్తున్న వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ షిరిడీ సాయిబాబా భక్తులందరికీ క్షమాపణ చెప్పాలని బిజెపి పార్టీ సూచన చేస్తూ సోషల్ మీడియా మాద్యమాలలో ఉన్న సంబంధిత వీడియోలను తక్షణం ఉపసంహరించుకోవాలని కోరుతున్నాము అని అన్నారు. ఇకపై భవిష్యత్తులో బిజెపి పార్టీలో ఉన్న వారు ఎవరూ భక్తుల హృదయాలను గాయ పరిచే ఇటువంటి వ్యాఖ్యలను చేసి సమాజంలో వివాదలకు తావు ఇవ్వరు అని శ్రీ ఎన్ రాాంచందర్ రావు గారు శ్రీ షిరిడీ సాయి భక్తులకు హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా శ్రీ సాయిబాబా భక్తులందరి తరఫున తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎన్ రాంచందర్ రావు కి కృతజ్ఞతలు మరియు అభినందనలు షిరిడి సాయి భక్త సమాజాలు తెలిపాయి. ఈ సందర్భంగా అధ్యక్షుల వారికి శ్రీ సాయిబాబా వారి ప్రసాదాన్ని అందచేసి సాయిబాబా శాలువతో సత్కరించారు.















