హైదరాబాద్, మార్చి 23 ఈతరం భారతం:
హైదరాబాదు లోని రవీంద్ర భారతి లో బాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యం తో విపంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ ఉగాది 2026 పురస్కారాల కార్యక్రమాన్ని విపంచి ఫౌండేషన్ అధ్యక్షుడు అనుముల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి తెలంగాణ భాషా సాంస్కృతిక సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ఐఏఎస్, ముఖ్యఅతిథిగా హాజరై, అవార్డు గ్రహితలకు ఉగాది పురస్కార పత్రం, మెమెంటో, శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ వివిధ రంగాలలో కృషి చేసిన వారిని గుర్తించి వారికి అవార్డు ఇవ్వడం వలన వారు అధిక ఉత్సాహంగా పనిచేస్తారని వారు అన్నారు. విపంచి ఫౌండేషన్ ద్వారా చేయడం ఎంతో అభినందనీయమని, ఫౌండేష చేస్తున్న పలు సేవలను ఈ సందర్భంగా వారు ప్రశంసించారు.
గ్రామీణ ప్రాంతాలలో ఉంటూ సేవలు చేస్తున్న పలు రంగాలకు చెందిన వ్యక్తులను, సంస్థలను గౌరవించడం ఎంతో శుభపరిణామం అని వారు తెలిపారు. వివిధ రంగాలలో నిష్ణాతులైన ఉద్దండులను ఒకే వేదికపై చేర్చడం ఫౌండేషన్ కృషి అనిర్వచనం అని వారు పేర్కొన్నారు.
వివిధ రంగాలలో కృషిచేసిన అవార్డు గ్రహీతలు
ఆచార్య ఏ ఏ ఎన్ రాజు – జీవన సాఫల్య పురస్కారం, చలపాక ప్రకాష్ -సాహిత్యం, తొర్ర రమేష్ – పాత్రికేయ రంగం, రాయపోలు అనంతనారాయణ – విద్య, దాయం ఝాన్సీ రాజిరెడ్డి – గ్రామీణ గ్రంథాలయం, దేవిన శ్రీనివాస్ – కళా రంగం వీరికి ముఖ్య అతిథి ఏనుగు నరసింహారెడ్డి చేతుల మీదుగా పురస్కారాలను అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజీ బాలా చారి మాట్లాడుతూ మరుగున పడుతున్న గ్రామీణ కళలను తట్టి లేపుతూ, గ్రామాలకు ఉతం ఇస్తున్న విపంచి ఫౌండేషన్ ను వారు కొనియాడారు. “స్టార్ట్ లైబ్రరీ సేవ్ లైబ్రరీ ” అనే నినాదంతో గ్రామ గ్రామాన గ్రంథాలయాల ఏర్పాటు కోసం పరితపిస్తున్న విపంచి ఫౌండేషన్ వారు ప్రశంసించారు.
పోలోజు రాజు, వెంకటాచారి, నకిరేకంటి సతీష్, పాండు లు పాటలు పాడి సబికులను ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ గాదె వినోద్ రెడ్డి, కల్లూరి రమేష్, విపంచి ఫౌండేషన్ గౌరవ సలహాదారుడు అందోజు నాగభూషణం, కమిటీ సభ్యులు గడ్డం సత్యనారాయణ, నరసింహ చారి, అనుముల అక్షయ, బూరుగు గోపికృష్ణ, కూరెళ్ల ఉపేందర్, అక్షిత, సాయిచంద్, తదితరులు పాల్గొన్నారు.















