ఈతరం భారతం సికింద్రాబాద్ మార్చి 12:
సికింద్రాబాద్ ప్యారడైస్ లోని ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం గురువారం ఎంతో ఘనంగా జరిగింది. పండగ వాతావరణం వెల్లివిరిసేలా తోరణాలతో, రంగురంగుల ముగ్గులతో కళాశాల ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు.కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కవితా దేవి, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మి, ఏఆర్ జ్ఞానేశ్వర్, అంబేద్కర్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్ డాక్టర్ రవి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.















