EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సికింద్రాబాద్ పీజీ కళాశాలలో తెలంగాణ బోనాల జాతర 

ఈతరం భారతం సికింద్రాబాద్, జూలై 31 :

ప్యారడైజ్ పరిధిలోని ఉస్మానియా యూనివర్సిటీ పిజీ కళాశాలలో విద్యార్థులు శుక్రవారం బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బోనాల ఉత్సవాన్ని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కవితా దేవి ప్రారంభించారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ గొర్రెలు మేకల పెంపకం అభివృద్ధి సంస్థ చైర్మన్ కొల్లె సరితా తిరుపతయ్య హాజరయ్యారు. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కవితాదేవి మాట్లాడుతూ తెలంగాణ జనజీవన సంస్కృతికి నిలువుటద్దం బోనాల పండుగ అని అభివర్ణించారు. ఆషాడ మాసంలో జరిగే తెలంగాణ గ్రామ దేవతల పండుగలలో బోనాలు ముఖ్యమైనవని ఆమె చెప్పారు. కార్పొరేషన్ చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య విద్యార్థులకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపమే బోనాలు అని ఆమె చెప్పారు. విద్యార్థినులు తెలంగాణ సంప్రదాయ వస్త్రధారణలో హాజరై పసుపు కుంకుమలతో అలంకరించిన మట్టి కుండల బోనాలను ఎత్తుకొని అమ్మవారి పాటల మధ్య నృత్యాలతో సందడి చేస్తూ గ్రామీణ ప్రాంతాల పండుగ ఉత్సాహాన్ని తలపింపచేశారు. అద్భుతంగా బోనాల జాతరను నిర్వహించిన విద్యార్థులను ముఖ్యఅతిథితో పాటు కళాశాల ప్రిన్సిపల్, లెక్చరర్ల బృందం అభినందించారు. వాతావరణం వైస్ ప్రిన్సిపల్ లక్ష్మి, కళాశాల లెక్చరర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top