EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సీఎం రేవంత్‌రెడ్డికి అరుదైన అంతర్జాతీయ ఆహ్వానం..

ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 22:

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుంచి ఏఐ పాలసీ సింపోజియానికి అధికారిక ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమం మార్చి 27వ తేదీన హార్వర్డ్ క్యాంపస్‌లో జరగనుండగా, భారత్ నుంచి ఆహ్వానం పొందిన ఏకైక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలిచారు.మార్చి 27వ తేదీన హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్వహించనున్న ఏఐ పాలసీ సింపోజియంలో పాల్గొని ప్రసంగించేందుకు సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు. ఈ సింపోజియంలో ‘AI as Infrastructure & Compute Power’ అనే కీలక అంశంపై జరిగే ప్రత్యేక ప్యానెల్‌లో ఆయన ప్రసంగించనున్నారు. ఈ వేదికపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను భవిష్యత్ మౌలిక వసతులుగా ఎలా అభివృద్ధి చేయాలి, డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూటింగ్ సామర్థ్యాల పెంపు వంటి అంశాలపై చర్చ జరగనుంది

Related News

Select the Topic
Scroll to Top