Aug 04, 2025, ఈతరం భారతం హైదరాబాద్ :సృష్టి కేసులో మరో కీలక మలుపు తిరిగింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి విదేశాలకు పారిపోవాలని యత్నించిన డాక్టర్ విజ్జు లతను CISF అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఆమెపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. డాక్టర్ నమ్రతతో కలిసి ఆమె సరోగసి, ఐవీఎఫ్ కేంద్రాలను నిర్వహించారని పోలీసులు అనుమానిస్తున్నారు. సృష్టి పేరుతో తీసుకున్న అనుమతులన్నీ విజ్జు లత పేరుమీద ఉన్నట్లు అధికారులు గుర్తించారు.















