ఈతరం భారతం హైద్రాబాద్ మే 12:
ప్రస్తుత సమాజంలో మానసిక ఆరోగ్యం అత్యంత కీలకమని, ఆ దిశగా నిరంతరం శ్రమిస్తున్న సైకాలజిస్టుల సేవలు అభినందనీయమని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. సైకాలజిస్టులకు వృత్తిపరమైన భరోసా, భద్రత కల్పించేందుకు ‘సైకాలజిస్ట్స్ కౌన్సిల్’ ఏర్పాటు ఎంతో అవసరమని, ఆ దిశగా తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ నందు తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ (TPA) ఆధ్వర్యంలో నిర్వహించిన “దశాబ్ది ఉత్సవాల అవార్డుల ప్రధానోత్సవం” కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో పెచ్చరిల్లుతున్న విపరీత ధోరణులకు మానసిక ఆరోగ్యం లోపించడమే ప్రధాన కారణమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒత్తిడిని జయించడానికి ప్రతి ఒక్కరూ యోగా, ప్రాణాయామం వంటివి అలవరచుకోవాలని సూచించారుమాజీ జాతీయ మహిళా కమిషన్ త్రిపురాణ వెంకటరత్నంసలహాదారు సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి కౌన్సిలింగ్ ఒక పదునైన ఆయుధంలా పనిచేస్తుందని, వేధింపులకు గురైన మహిళల్లో మనోధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత సైకాలజిస్టులపై ఉందని పేర్కొన్నారు.
గౌరవ అతిధు లు ప్రముఖ నిర్మాత & దర్శకులు తమ్మరెడ్డి భరద్వాజ మాట్లాడుతూ TPA పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం అభినందనీయమని అన్నారు. సమాజంలో జరుగుతున్న అకృత్యాలు, ఆత్మహత్యలను నివారించడంలో సైకాలజిస్టుల పాత్ర వెలకట్టలేనిదని తెలిపారు. టుంబాలలో తలెత్తే వివాదాలు విడాకులకు దారి తీస్తున్నాయని, డిప్రెషన్‌కు గురవుతున్న వారికి సరైన సమయంలో కౌన్సిలింగ్ అందించి వారిని కాపాడాలని కోరారు.
మానసిక వైకల్యం లేని సమాజాన్ని నిర్మించి, యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపాల్సిన గురుతర బాధ్యత సైకాలజిస్టులపై ఉందని అన్నారు. డా. మోతుకూరి రాంచందర్ (TPA రాష్ట్ర అధ్యక్షులు): అసోసియేషన్ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సమాజంలో మానసిక సమస్యల పరిష్కారానికి మే 5 నుండి 15 వరకు వివిధ మానసిక ఆరోగ్య సదస్సులు మరిన్ని ఉచిత కౌన్సిలింగ్ సేవలు మరియు అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేస్తామని ప్రకటించారు. అవార్డుల ప్రధానం: ఈ వేడుకల్లో భాగంగా విశేష సేవలు అందించిన వారికి 14 మందికి: ‘వుమెన్ ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సైకాలజీ అవార్డ్’, 08 మందికి: ‘మైండ్ అండ్ మెరిట్ అవార్డ్’20 మందికి: ‘డికేడ్ ఆఫ్ సర్వీస్ అవార్డ్’ కింది అవార్డులను అందజేశారు.ఈ కార్యక్రమంలో సైకియాట్రిస్టు డా. హరిణి, వి.వి.ఎన్. వసుంధర, డా. పూర్ణిమ నాగరాజ మరియు సంఘ నాయకులు శ్రీపూజ, సుధాకర్, కృష్ణసాహితి, బి. నారాయణ రావు, సునయన, రాజు ఆచార్య, దేదీప్య, వశిష్ఠ, విశాల శ్రీకాంత్ మజ్జిగ తదితరులు పాల్గొన్నారు.














