ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 7 :తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. స్థానిక ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ బైపోల్ కారణంగా హైదరాబాద్‌లోనూ ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. దీంతో సంక్షేమ, అభివృద్ధి పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు తరలిస్తే పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.















