హైదరాబాద్ అక్టోబర్ 4 ఈతరంభారతం : హరీష్ రావు కు ఓ అరుదైన వ్యాధి సోకిందని,ఈ వ్యాది సోకినవారు తమకు తామే గొప్పగా ఊహించుకుంటారని,అబద్దాలను సిస్సంకోచంగా, నిసిగ్గుగా మాట్లాడుతారని, టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు.శనివారం గాంధి భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ నార్సిసిస్టిక్ వ్యక్తిత్వం అనే ఈ వ్యాది మనుషుల్లో మాత్రమే కనిపించే ఒక అరుదైన డిజార్డర్ (రుగ్మత) అన్నారు.ఏదైనా మంచి జరిగితే, దాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారు. ఎన్ని అబద్దాలైనా నిస్సంకోచంగా, నిస్సిగ్గుగా మాట్లాడుతారు. ఈ తరహా నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్డ్ ఉన్న వ్యక్తుల్లో కేసీఆర్ ఒకటో నంబరైతే, హరీశ్ రావు రెండో నంబర్.. నోటికొచ్చిన అబద్ధాన్ని అందంగా, అందరూ నమ్మేలా చెప్పడంలో గోబెల్స్‌ని మించిన వంచకులు వీరిద్దరు.ఓవైపు టిమ్స్ హాస్పిటళ్లను అద్భుతంగా తీర్చిదిద్దే పనిలో ప్రభుత్వం ఉంటే.. పబ్లిసిటీ కోసం హరీశ్‌రావు పాకులాడుతున్నదన్నారు..2014 నుంచి 2023 చివరి వరకూ అధికారంలో ఉన్నది వాళ్లే.. జిల్లాకో నిమ్స్ హాస్పిటల్ కడుతామని 2014 మేనిఫెస్టోలో పెట్టారు.. ఏ జిల్లాలో కట్టారు నిమ్స్..?2016 ఫిబ్రవరిలో, అప్పటి గవర్నర్ ఈఎస్ఎల్ఎన్ నరసింహన్ గాంధీ హాస్పిటల్లో పర్యటించి, ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం నలువైపులా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు అప్పుడు ప్రకటించిండు కేసీఆర్..మళ్లీ 2020లో కరోనా వచ్చే వరకు కూడా ఆరోగ్యశాఖను, హాస్పిటళ్లను పట్టించుకున్న పాపానపోలేదు.కోవిడ్ వచ్చాక నగరం చుట్టూ 4 టిమ్స్‌లు అంటూ.. పాత హామీనే కొత్తగా ప్రకటించారు. గచ్చిబౌళి స్టేడియానికి సంబంధించిన ఓ భవనానికి టిమ్స్ అని బోర్డు తగిలించారు.నాలుగు టిమ్స్‌ల్లో ఒక టిమ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామంటూ జబ్బలు చరుచుకున్నారన్నారు..కోవిడ్ తగ్గగానే గచ్చిబౌళి టిమ్స్ మూత పడేశారు.ఇక మిగిలిన 3 టిమ్స్‌ల గురించి 2022 వరకూ అసలు ఊసే లేదు.ప్రజలు, నాటి ప్రతిపక్షం ప్రశ్నించడంతో 2022 ఏప్రిల్‌లో అప్పటి ముఖ్యమంత్రిగారు హడావుడిగా శంకుస్థాపన చేశారు. హాస్పిటళ్ల పేరుతో భూములు బ్యాంకులకు తాకట్టు పెట్టి అడ్డగోలుగా అప్పులు చేశారు. 2023 చివరి వరకూ అధికారంలో వాళ్లే ఉన్నారు.2023లో ఎన్నికలు పూర్తయ్యే నాటికి కనీసం సగం పనులను కూడా పూర్తి చేయలేదు.కానీ, నిర్మాణ వ్యయం అంచనాలను అడ్డగోలుగా పెంచేసి జేబులు నింపుకున్నారని ఆరొపించారు. మేము అధికారంలోకి వచ్చాక అన్ని హాస్పిటళ్ల నిర్మాణాలపై ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి పనులను కొనసాగించాలని ఆదేశించారు.అంచనాల పెంపు అక్రమాలపై విచారణకు ఆదేశించారు.ఓవైపు అక్రమాలపై విచారణ జరిపిస్తూనే, మరోవైపు హాస్పిటళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తయ్యేల చర్యలు తీసుకున్నాం.డిసెంబర్ నుంచి సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు..ఓవైపు అత్యాధునిక వసతులతో టిమ్స్‌లను తీర్చిదిద్దే పనిలో మా ప్రభుత్వం ఉంటే, హరీశ్రావుగారు పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారు.ఎల్బీనగర్కు వెళ్లి ఏదో షో చేసి, నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడారు.ఉస్మానియా హాస్పిటల్ కలను మేము నెరవేరుస్తుంటే, ఆయన చూసి తట్టుకోలేకపోతున్నడు.ఆరోగ్యశ్రీ అద్భుతంగా పని చేస్తోందంటూ పత్రికల్లో వార్తలు వస్తుంటే, ప్రజలకు వైద్యం అందడం లేదంటూ దొంగ ఏడుపులు ఏడుస్తున్నడు.వాళ్ల హయాంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటళ్లకు నెలకు సగటున 57 కోట్లు ఇస్తే, మేము ఈరోజు నెలకు వంద కోట్లు చెల్లిస్తున్నాం.ఖ్య పెంచినం.. ప్రొసీజర్ల సంఖ్య పెంచినం.. 5 లక్షల లిమిట్‌ను 10 లక్షలు చేసినం..గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్లకు పునర్వైభవం తీసుకొచ్చే పనిలో మేము ఉంటే, ప్రభుత్వ హాస్పిటళ్లను బదనాం చేస్తూ, శవాల మీద పేలాలు ఏరుకునే పనిలో ఉన్నారని విమర్శించారు,.















