EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

హైకోర్టు న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసులో ఏడుగురి అరెస్ట్

ఈతరం భారతం హైదరాబాద్ మే 29

హైకోర్టు సీనియర్ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్.తెలిపారు.హైకోర్టు సీనియర్ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ గత వారం హైదరాబాద్లో దారుణ హత్యకు గురయ్యారు. ఉదయం సమయంలో కారుతో ఢీకొట్టి దుండగులు హత్య చేశారు. సీసీ కెమెరా వీడియోల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయవాది దినచర్యపై నిరంతరం నిఘా పెట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. న్యాయవాది హత్యపై ఆయన కుమారుడు ఫరాన్హ్ తీవ్ర ఆరోపణలు చేశారు. దశాబ్దాలుగా వక్ప్ బోర్డు ఆస్తుల రక్షణ కోసం చేస్తున్న పోరాటాలే హత్యకు కారణమని ఆరోపించారు. తాజాగా ఈ కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. ఈ హత్య కేసులో ఏడుగురు నిందితులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి, హత్యకు కారణాలు, కుట్రకోణానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు .

Related News

Select the Topic
Scroll to Top