ఈతరం భారతం హైదరాబాద్ / యాదాద్రి భువనగిరి:జూన్ 5:
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి నేతృత్వంలో హైదరాబాద్ హైటెక్స్ (HITEX) హాల్ నెంబర్ 4 లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ స్థాయి ‘Thread Pochampally’ (థ్రెడ్ పోచంపల్లి) చేనేత ప్రదర్శన మరియు విక్రయ కేంద్రాన్ని రాష్ట్ర రోడ్లు-భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి , రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార మరియు చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు.
ఈ వైభవ ప్రారంభోత్సవ వేడుకలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరియు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఐఏఎస్ పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన, గజం అంజయ్య విశిష్ట అతిథులుగా పాల్గొని ప్రదర్శనలోని చేనేత స్టాళ్లను సందర్శించారు.














