ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 16
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 63మంది ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌బిలో పనిచేస్తున్న వారిని ఎస్‌హెచ్‌ఓలుగా నియమించారు. స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న రాంబాబు, రామకృష్ణ, లక్ష్మినారాయణ రెడ్డి, రుక్మిణీ, రాజగోపాల్ రెడ్డిని ఎస్‌హెచ్‌ఓలుగా నియమించారు. జూబ్లీహిల్స్ ఎస్‌హెచ్‌ఓగా పనిచేస్తున్న వెంకటేశ్వర్ రెడ్డిని ఎస్‌బికి బదిలీ చేసి, ఆయన స్థానంలో శ్రీనివాసులు రెడ్డిని నియమించారు
.















