ఈతరం భారతం హైద్రాబాద్ మే 23 –
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాలంటే వెంకటాద్రి, నారాయణాద్రి, పద్మావతి ఎక్స్ప్రెస్ రైళ్లున్నాయి. ఇందులో పద్మావతి ఎక్స్ ప్రెస్ వరంగల్, ఖమ్మం, విజయవాడ మీదుగా వెళ్తే, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మహబూబ్నగర్, గుత్తి జంక్షన్ల మీదుగా తిరుపతి చేరుకుంటుంది. ఇక నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ నల్లగొండ, గుంటూరు మీదుగా వెళ్తుంది. ఈ నేపథ్యంలో నల్లగొండ మీదుగా గుంటూరు వెళ్లకుండానే కడప మీదుగా సరికొత్త మార్గంలో తిరుపతికి మరో ట్రైన్ వచ్చేసింది. ఈ మేరకు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ రెగ్యులర్ చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. ఈ రైలు ప్రతి గురువారం తిరుపతి నుంచి, ప్రతి శుక్రవారం చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది.














