EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

హైదరాబాద్ మెట్రోకు ₹13,600 కోట్ల రీఫైనాన్సింగ్ ఒప్పందం..

ఈతరం భారతం హైదరాబాద్ మే 25

హైదరాబాద్ మెట్రోకు ₹13,600 కోట్ల రీఫైనాన్సింగ్ ఒప్పందం.. తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి యాజమాన్యం.హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ₹13,600 కోట్ల రీఫైనాన్సింగ్ కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC), ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.20 ఏళ్ల కాలపరిమితితో, త్రైమాసిక వాయిదాల విధానంలో ఈ రుణ సౌకర్యం అందించబడుతుంది. ఈ ఒప్పందం తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సమక్షంలో జరిగింది.ఈ రీఫైనాన్సింగ్‌తో హైదరాబాద్ మెట్రో రైల్ 100 శాతం యాజమాన్యం తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ అయ్యే అవకాశం కలిగిందని ప్రధాన కార్యదర్శి తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top