EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

16 లక్షల 75 వేల విద్యార్థుల ఫీజుల బకాయిలు చెల్లించాలి.. సంక్షేమ భవన్ వద్ద విద్యార్థుల మహాధర్నా.. దద్దరిల్లి న సంక్షేమ భవన్ ..

హైదరాబాద్ ఆగస్టు 22 (ఈతరం భారతం);16 లక్షల 75 వేల విద్యార్థుల 8000 వేలకోట్ల స్కాలర్షిప్ ఫీజుల బకాయిలు చెల్లించాలని డిమాడ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నేతృత్వం లో శుక్రవారం సంక్షేమ భవన్ వద్ద విద్యార్థుల మహాధర్నా నిర్వహించారు. .. సంక్షేమ భవన్ దద్దరిల్లి పోయింది ఈ సందర్బంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వం తన మొద్దు నిద్రని వీడకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు తప్పవని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హెచ్చరిక.నిధుల విడుదలకు అడ్డుకట్ట వేస్తూ గాల్లో దీపంగా మారిన విద్యార్థులు చదువులు.. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు విద్యార్థుల స్కాలర్షిప్లు చెల్లించరా? మూడు సంవత్సరాలుగా విద్యార్థుల స్కాలర్షిప్ బకాయిలు చెల్లించడం లేదుపది నెలలుగా విద్యార్థులు రోడ్డు మీద వచ్చి ఉద్యమాలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఆర్థిక శాఖ కాంట్రాక్టర్లు అంటే చాలా ప్రేమ ఉంది కానీ అంటే పట్టించుకోవడం లేదు… ఆర్థిక శాఖ వైఖరి మార్చుకోకపోతే తీవ్ర తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు..జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ, విద్యార్థులు స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లపై ఆధారపడి చదువుకుంటున్నారని, కానీ ప్రభుత్వం ఆలస్యం చేయడంతో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని విమర్శించారు. దీని వల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆయన తెలిపారు.ఫీజు బకాయిలను వెంటనే చెల్లించకపోతే తీవ్ర స్థాయి ఉద్యమాలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమణం లో — ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top