హైదరాబాద్ జూలై 27 (ఈతరం భారతం);ప్రముఖ సంఘ సేవకురాలు రచయిత్రి కె హెచ్ ఎస్ జగదంబరచించిన కాశీ విశ్వేశ్వర నామావళి గ్రంధావిష్కరణక ార్యక్రమం ఈనెల 29న మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని రామ్ నగర్ గుండు లోగల పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు శ్రీ మానస ఆస్ థియేటర్స్ అధ్యక్షులు బండారుపల్లి రామచంద్రారావు ఒక ప్రకటనలో తెలిపారు. లయన్ డాక్టర్ బండారు సుజాత రాజశేఖర్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి విధుషిమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని గ్రంధాన్ని ఆవిష్కరిస్తారు. లయన్ డాక్టర్ పేకేటి గీత శివరాం, ఇన్సూరెన్స్ వృత్తి నిపుణుల సూరి సీతారాం అతిథులుగా పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు సభకు అందరూ ఆహ్వానితులే.















