EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

31న భగవాన్ మహావీర్ 2625వ జయంతోత్సవాలు

హైదరాబాద్ మార్చ్ 23 ఈతరం భారతం:

భగవాన్ మహావీర్ 2625వ జయంతోత్సవాలను 2026, మార్చ్ 31న సికింద్రాబాద్, ఇంపీరియల్ గార్డెన్స్ లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ మహావీర్ జైన్ సేవ సంఘ్, త్రినగర్, తెలంగాణ కోర్ కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో శ్రీ మహావీర్ జైన్ సేవ సంఘ్, త్రినగర్, తెలంగాణ కోర్ కమిటీ సభ్యులు ప్రదీప్ సురానా, పరస్ ర్యాంక, కిషోర్ ముఠా, మహావీర్ టాటెడ్, జై ప్రకాష్ ముఖాన, విజయ్ సూరన, నేమి ముఖాన, పవన్ పాండియ, సురేష్ బోహ్రా, కైలాష్ మండోత్, ఘేవర్ కొఠారి, దినేష్ జైన్ లు మాట్లాడుతూ తాను గ్రహించిన శాశ్వత సత్యాన్ని ప్రజలకు బోధించిన జైనమత 24వ తీర్థంకరుడైన వర్ధమాన భగవాన్ మహావీరుదని తెలిపారు. భగవాన్ మహావీర్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 31 తేదీన ఉదయం తొమ్మిది గంటలకు తాడ్ బాన్ హనుమాన్ దేవాలయం నుండి ఇంపీరియల్ గార్డెన్, సికింద్రాబాద్ వరకు మహావీరుని విగ్రహాన్ని అలంకరించిన రథయాత్ర మరియు “వర్గోద” వైభవోపేతమైన ఆధ్యాత్మిక ఊరేగింపు ను నిర్వహిస్తున్నట్లు అనంతరం ఉదయం పది గంటలకు ఇంపీరియల్ గార్డెన్ లో ఉత్సాహభరితమైన ధర్మ సభ జరుగుతుందని తెలిపారు. జంట నగరాల నుండే కాకుండా తెలంగాణ రాష్ట్ర నలుమూలలనుండి వేలాదిమంది జైన భక్తులు హాజరైతారని. పూజ్య జైన సన్యాసులు, సన్యాసినులు ధర్మ సభలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు, శాంతి, కరుణ, వినయం, నిస్వార్థత మరియు ఆధ్యాత్మిక జాగృతి సందేశంతో జీవించాలనే లక్ష్యంతో ప్రార్థనలు చేస్తారని, భగవాన్ మహావీరుని బోధనలు జైన తత్వశాస్త్రానికి మూల సూత్రాలుగా ఉన్నా అహింస, సత్యం, అస్తేయ, బ్రహ్మచర్యం, అపరిగ్రహం వంటివి బోధిస్తారని వారు తెలిపారు. ఈ ధర్మ సభలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు వివిధ జైన మండళ్లు ఏర్పాటు చేసిన స్టాల్ లలో ప్రసాదం, పానీయాలు ఉచితంగా పంపిణి చేస్తారని వెల్లడించారు. ఈ రథయాత్ర, ధర్మ సభలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలనీ వారు విజ్ఞప్తి చేసారు. ఈ సందర్బంగా భగవాన్ మహావీర్ 2625వ జయంతోత్సవల బ్రోచర్ ను వారు విడుదల చేసారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top