EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’   నెక్లెస్ రోడ్ పై తిరంగా యాత్రను జెండా ఊపి ప్రారంభించిన రాంచందర్ రావు

హైదరాబాద్ ఆగస్టు 14 (ఈ తరం భారతం);79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ జండా కార్యక్రం లో బాగంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పై తిరంగా యాత్రను బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు జెండా ఊపి ప్రారంభించారు.ఈ ర్యాలీలో జంట నగరాలకు చెందిన బిజెపి నాయకులు, కార్యకర్తలు, వివిధ కళాశాలల విద్యార్థులు, యువకులు, పౌరులు జాతీయ జెండాలను చేతబూని పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం, తిరంగా యాత్ర భారతదేశంలో ప్రతి పౌరుడి గుండెలో దేశభక్తిని నింపుతోంది.ప్రతి ఇంటి మీద జాతీయ పతాకం ఎగరేయడం ద్వారా దేశ ఐక్యత, గౌరవం, సమగ్రత, దేశభక్తిని నింపేలా గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.ఇదే నేపథ్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో చేపట్టిన తిరంగా ర్యాలీలో యువత, విద్యార్థులు, మహిళలు అందరూ పెద్ద ఎత్తున భాగస్వామ్యమయ్యారు.

నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో భారతదేశం సుపరిపాలనతో ముందుకు సాగుతోంది.భారతదేశం ప్రపంచంలో నాలుగో స్థానంలో ఆర్థిక శక్తిగా ఎదిగింది. రాబోయే రోజుల్లో సూపర్ పవర్‌గా అవతరిస్తుంది.దేశం అభివృద్ధి చెందాలంటే దేశభక్తి, జాతీయవాదం (నేషనలిజం) అవసరం. ఆ నేషనలిజం స్ఫూర్తిగా దేశ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది.తెలంగాణలో 40 లక్షల ఇండ్లపై త్రివర్ణ పతాకం ఎగురవేసి దేశభక్తిని చాటడం జరుగుతోంది. రాబోయే తరాలకు ఈ స్ఫూర్తిని అందించాలి.నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా ప్రతి వీధిలో, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురుతోంది. తిరంగా యాత్ర జరుగుతోంది.భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి వేలాది మంది పోరాటయోధులు, మహనీయుల త్యాగాలే కారణం. వారి త్యాగాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకం.మన దేశాన్ని విడగొట్టి మన దేశ సంపద దోచుకున్న పాకిస్థాన్ కు, ఆ రోజున మతం ఆధారంగా దేశాన్ని విడగొట్టిన బ్రిటిషర్లకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది.మరోసారి దేశ విభజనకు ప్రసక్తే ఉండకూడదు. ఆ సంకల్పంతో భారతదేశ ఐక్యతను, సమగ్రతను, సంస్కృతిని కాపాడేలా తిరంగా యాత్ర ద్వారా సంకల్పం తీసుకోవడం జరిగింది.

Related News

Select the Topic
Scroll to Top