ఈతరం భారతం కామారెడ్డి ఆగస్ట్ 8
కురిసిన వర్షానికి కామారెడ్డి పట్టణంలోని స్టేషన్ రోడ్డు పై పోలీస్ స్టేషన్ ముందు భారీగా నీరు నిలిచింది. దీంతో 46, 47వ వార్డుల కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న, లక్ష్మీనారాయణ రహదారిపై ఏర్పడిన నీటి కుంటలో కూర్చుని నిరసన తెలిపారు.కామారెడ్డి-కరీంనగర్ జాతీయ రహదారిపై నీరు నిలవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ మార్గంలోనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఉండటంతో 108 అంబులెన్స్‌లు, రోగుల వాహనాలకు కూడా ఇబ్బందిగా ఉందన్నారు. సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని, లేనిపక్షంలో అక్కడే దీక్ష చేస్తామని కౌన్సిలర్లు హెచ్చరించారు.















