ఈతరం భారతం అక్టోబర్ 6 ఖమ్మం :అక్టోబర్ 8 లోపు స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జెడ్పిటిసి ) బ్యాలెట్ పేపర్ల ముద్రణకు టెండర్లు దాఖలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్డర్ ఇచ్చిన 4 రోజుల లోపు బ్యాలెట్ పేపర్ల ముద్రణ చేయాలని, బ్యాలెట్ పేపర్ల ముద్రణకు అవసరమైన సింబల్ బ్లాక్స్, పింక్, వైట్ పేపర్ మొదలైనవి సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణకు ఆసక్తి గల వారు జెడ్పి సీఈఓ వద్ద 5000 రూపాయల డిడి చెల్లించి టెండర్ ఫారం తీసుకోవాలని, ఆసక్తి గలవారు 50 వేల రూపాయల డిడితో కలిపి టెండర్ ఫారం అక్టోబర్ 8 లోపు సమర్పించాలని, అక్టోబర్ 8 సాయంత్రం 4.00 గంటలకు కలెక్టరేట్ కార్యాలయంలో టెండర్ ఓపెన్* చేయడం జరుగుతుందని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.















