ఈతరంభారతం ఖమ్మం జూలై 30 :బిఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు బుధవారం ఖమ్మం నగరంలో విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా విడివోస్ కాలనీ వాస్తవ్యులు తెలంగాణ ఉద్యమకారులు డోకుపర్తి సుబ్బారావు కుమార్తె వివాహాం ఇటీవల జరుగగా వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తెలంగాణ ఉద్యమకారులు నెల్లూరి అచ్యుతరావు, పగడాల నరేందర్, జడల వెంకటేశ్వర్లు, మరికంటి రేణుబాబు, మందడపు శంకరరావు, ఆసిఫ్ అహ్మద్, బురాన్, లింగన్న బోయిన సతీష్ తదితరులు హాజరైనారు. అక్కడ నుండి ఖమ్మం పట్టణ బిఆర్ఎస్ నాయకులు గొడ్డేటి మాధవరావు మనవడు బారసాల, నామకరణ వేడుక ఇటీవల జరిగిన సందర్భంగా వారి కుమార్తె సాయిసుధ-వెంకటేష్ దంపతుల కుమారుడు చిరంజీవి తన్విక్ ఆర్యన్ ఆశీర్వాదించారు అనంతరం ఖమ్మం పట్టణంలో ఇందిరానగర్ లో నివాసం ఉంటున్న ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ వాస్త్యవులు ప్రతాపనేని సుధాకర్ మాతృమూర్తి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కామంచికల్ గ్రామ మాజీ సర్పంచ్ మేదరమెట్ల వెంకటరమణ తో పాటు మధుసూదన్ రావు, శ్రీను నామ మిత్రులు డీజే నెహ్రూ, సీతాపతి, బొల్లెపల్లి కోటేశ్వరరావు కూడా ఉన్నారు. అనంతరం శ్రీనివాస్ నగర్ వాస్తవ్యులు గుడిపూడి సుధాకర్ మాతృమూర్తి పద్మావతి మృతి చెందగా వారి స్వగృహానికి వెళ్లి వారి మాతృమూర్తి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించినారు అలానే అదే కాలనీలో వడ్డే లెనిన్ చౌదరికు ఇటీవల గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసి వారి స్వగృహానికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని నామ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో కనకమేడల సత్యనారాయణ, బిఆర్ఎస్ వైరా రూరల్ మండల పార్టీ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ దండా జ్యోతిరెడ్డి, బిఆర్ఎస్ నాయకులు మోతారపు సుధాకర్, మోరంపూడి ప్రసాద్ రావు, ధనాల శ్రీకాంత్, పాలడుగు పాపారావు, కొప్పెర నరసింహారావు, బత్తుల శ్రీనివాసరావు, వాకదాని కోటేశ్వరరావు, మస్తాన్, రఘు, దేశబోయిన మంగారావు, నారుమళ్ల వెంకన్న, ఎదునూరి శ్రీను, వాసిరెడ్డి సుబ్బారావు, రామ సీత, కోటేశ్వరరావు, ప్రసాద్, వెంకటరమణ, నాగేశ్వరరావు, షారుక్ లతో పాటు తెలుగుదేశం నాయకులు నరేష్, భూపతి, అంజి, నాగేశ్వరరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.















