07.08.2025 ఈతరం భారతం ఖమ్మం :
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నాటకోత్సవాలకు హాజరయ్యే 180మంది కళాకారుల బృందానికి ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించడంపై హర్షం : భక్త రామదాసు కళా క్షేత్రం లో ప్రేక్షకులకు స్నాక్స్, టీ సదుపాయం ఏర్పాటుపై ధన్యవాదాలు:పేరులోనే కాదు.. చేత ద్వారా.. చేతి ద్వారా సహాయం తన సహజ లక్షణంగా మలుచుకున్న మారాజు అంటూ.. కృతజ్ఞతాసుమాలు
ఖమ్మం: కళల గుమ్మం మన ఖమ్మం లో నేటి (గురువారం) నుండి నాలుగు రోజుల పాటు అటు విశాఖపట్నం నుండి ఇటు కరీంనగర్ వరకు 150 మంది కళాకారులు మన ఖమ్మం లో నెల నెలా వెన్నెల ఆధ్వర్యంలో జరిగే ఉభయ తెలుగు రాష్ట్రాల నాటకోత్సవాలకు 150 మంది కళాకారులు, 30 మంది టెక్నీషియన్స్ మన ఖమ్మంలో ప్రేక్షకులకు కనుల విందు చేసేందుకు హాజరవుతున్నారని.. ఈ కళాకారులందరికీ మన ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి గారు వసతి మరియు భోజన సౌకర్యం కల్పిస్తూ అలాగే ఈ నాలుగు రోజులపాటు భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగే నాటికల పోటీలకు హాజరవుతున్న ప్రేక్షక దేవుళ్లకు ప్రతిరోజూ స్నాక్స్ మరియు టి అందిస్తూ తమ విశాల హృదయాన్ని చాటుకున్న రామ సహాయం రఘురాం రెడ్డి గారికి నెల నెలా వెన్నెల నిర్వాహక కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. అన్నా బత్తుల సుబ్రహ్మణ్య కుమార్, మోటమర్రి జగన్మోహన్రావు, కే దేవేంద్ర, డాక్టర్ నాగబత్తిని రవి, డాక్టర్ వేల్పుల విజేత, నామ లక్ష్మీనారాయణ, వేముల సదానంద్ లు ఒక ప్రకటనలో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రతిరోజు ఆరు గంటల నుండి ప్రారంభమయ్యే ఈ నాటిక పోటీలకు ప్రేక్షకులు , కళాకారులు, కళా పోషకులు, కళాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఒక ప్రకటనలో తెలియజేశారు.















