ఈతరం భారతం :ఖమ్మం కల్చరల్,జూలై 15 :ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని రేవతి సెంటర్,ఖానాపురం హవెలి, రమణగుట్ట పలు ప్రాంతాల్లో బంజారా సీత్లా భవాని దాటుడు పండుగ సందర్భంగా మంగళవారం అమ్మవార్ల విగ్రహాలకు అంగరం గవైభవంగా వేడుక జరిపారు.అమ్మవార్లకు పూజారులు పూజలు నిర్వహించడం జరిగింది. బంజా రా(లంబాడీ) సమాజంలో సీత్లా భవాని,దాటుడు పండుగ అనేది ఏడాది తొలిదైన, ముఖ్యమైన పండుగగా జరుపుకో బడుతుంది. ప్రధానంగా ఆషాఢ మాసం (జూలై)లో జరుపుకుంటారు. ఆలయ ప్రాంగణాలు భక్తులతో కళకళ లాడుతూ కనిపించాయి మంగళవాయిద్యాలు,డీజే లతో బంజారా(లంబాడి) కుటుంబాలు భక్తిశ్రద్దలతో బోనాలు ఎత్తుకొని గుడి ప్రాంగణాలకు చేరుకొని అమ్మావార్లకు బోనాలు సమర్పించి పూజించారు.















