EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఖమ్మం నుంచి రాజకీయ మార్పు పునాది! కాంగ్రెస్-బీఆర్ఎస్ పాలనలపై ప్రజల విరక్తి మీడియా సమావేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, స్థానిక సంస్థల ఎన్నికల ఖమ్మం జిల్లా ఇంచార్జ్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి.

ఈ తరం భారతం ఖమ్మం, ఆగస్టు 4:తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో ఇప్పుడు ఖమ్మం జిల్లా కేంద్రబిందువుగా మారింది. గతంలో ఎన్టీఆర్‌కు అండగా నిలిచిన ఈ జిల్లా, ఇప్పుడు ప్రధాని మోదీకి నైతిక మద్దతు తెలుపుతోంది. రాజకీయంగా నిరాశకు గురైన ప్రజలు, ప్రభుత్వ విధానాలపై అసహనం వ్యక్తం చేస్తున్న యువత ఈసారి మార్పు కోసం ముందుకు వస్తున్నారనీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, స్థానిక సంస్థల ఎన్నికల ఖమ్మం జిల్లా ఇంచార్జ్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన ‘మహా సంపర్క్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా మీడియా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

“ఈ జిల్లా గతంలో ఎన్టీఆర్‌కు రాజకీయ బలం ఇచ్చింది. అదే ప్రజలు ఇప్పుడు ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీకి శక్తిని ప్రసాదించబోతున్నారు. ఖమ్మం జిల్లాలో రాజకీయ వాతావరణం మారుతోంది. ప్రజలంతా మార్పు వైపు మొగ్గు చూపుతున్నారు. మేము బూత్ స్థాయిలో ప్రచారం నిర్వహించి, అభివృద్ధిని వివరించనున్నాం” అన్నారు. అదెలా ఉండగా  “బీఆర్ఎస్ కుటుంబ కలహాలతో అలజడి. కాంగ్రెస్ ప్రభుత్వంలో శూన్యతే మిగిలింది. సమన్వయం లేక ప్రభుత్వం చీలిపోయినట్లయింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి ఎంత దుర్భరమో ప్రజలు చూస్తున్నారు” అన్నారు. యువతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.

“ఖమ్మం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రతి బూత్‌లో ‘మహా సంపర్క్అభియాన్’ సమావేశాలు నిర్వహించనున్నాం. మోదీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. అదే అభివృద్ధిని రాష్ట్రంలోకి తీసుకురావడానికి బీజేపీని పట్టాలి,” అన్నారు.బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర రావు మాట్లాడుతూ జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో అత్యధిక విజయం సాధించడమే మా లక్ష్యం. గతంలో టీడీపీ వర్గాలు ఇప్పుడు బీజేపీలోకి వచ్చి పార్టీకోసం పని చేస్తున్నాయి. రాష్ట్రంలో ముగ్గురు మంత్రులు ఖమ్మం జిల్లాకు ఉన్నా అభివృద్ధి నిధులు రావడం లేదు. హాస్టళ్లలో విద్యార్థులకు కనీస వసతులు లేవు. ఇది పాలన వైఫల్యానికి ప్రత్యక్ష నిదర్శనం” అన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి నేతలు దేవకీ వాసుదేవరావు, ఇవి రమేష్, నున్న రవికుమార్, పుల్లారావు యాదవ్, దొంగల సత్యనారాయణ, నంబూరి రామలింగేశ్వరరావు, అల్లిక అంజయ్య, జ్వాలా నరసింహారావు, గడిల నరేష్, ధనియాకుల వెంకటనారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top