ఈతరం భారతం .12.08.2025 పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం:
గంజాయి కేసులో ఇద్దరికి 20 ఏండ్ల జైలు శిక్ష .ఒక్కొక్కరికి 2 లక్షల జరిమానా.మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు తీర్పు.ప్రాసిక్యూషన్ కు సహకరించిన అధికారులను అభినందించిన పోలీస్ కమిషనర్.గంజాయి తరలిస్తూ పట్టుబడిన ఇద్దరికి 20 ఏండ్ల చొప్పున కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రెండు లక్షల జరిమాన విధిస్తూ.. మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు గౌరవనీయ న్యాయమూర్తి కె. ఉమాదేవి తీర్పు వెల్లడించారు.ప్రాసిక్యూషన్ కధనం ప్రకారం.. జల్సాలకు అలవాటు పడి, అక్రమార్జన కోసం 2021ఏప్రియల్ 28న మోతుగూడెం నుండి కారులో 30 లక్షల విలువ చేసే 200 కేజీల గంజాయి అక్రమంగా రవాణా చేస్తూ ఖమ్మం సమీపంలోని వి. వెంకటపాలెం వద్ద పోలీస్ చెక్పోస్ట్ ఉందని, వేగంతో కారు నడుపుకుంటూ ప్రయాణికులతో కూడిన ఆటోను బలంగా డీ కొట్టడంతో ఆటో, కారు బోల్తా పడ్డాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంలో మృతి చెందిన ఆటో ప్రయాణికుడిని మార్చురికి, గాయపడిన వారిని ఆసుపత్రి తరలించారు. అనంతరం కారు పరిశీలించగా 200 కేజీల 100 గంజాయి ప్యాకెట్లు లభించాయి. ఇద్దరు నిండుతులను అదుపులో తీసుకోగా మరో నింది తుడు పారిపోయాడు.నిందితులపై రఘునాథపాలెం పోలీస్ స్టేషన్లో Cr.no 87/2021 U/s 304(A), 338, 337 IPC మరియు సెక్షన్ 8(c) R/w 20(b) of NDPS act, 1985 చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.
ప్రస్తుతం హైదరాబాద్లోనిదుండిగల్,గండిమైసమ్మ ప్రాంతంలో నివసిస్తున్నA1 నిండుతుడు మల్లేష్ @ నాయక్ మల్లేష్ 21 సం,, గద్వాల్, మహబూబ్నగర్ జిల్లా.A2 నిండుతుడు గడ్డం బువన్ @ యెరుగుంట్ల రవితేజ, 20 సం,ప్రైవేట్ ఉద్యోగం, జగిత్యాల జిల్లా కోరుట్ల ను అరెస్టు చేసి సమగ్ర దర్యాప్తు అనంతరం కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. పరిశీలించిన న్యాయమూర్తి.. నిందితులపై మోపిన అభియోగం రుజువు కావటంతో పైవిధంగా తీర్పు చెప్పారు.A3 నింది తుడు ఇషాక్ R/o గండిమైసమ్మ ప్రాంతం, హైదరాబాద్ దిండిగల్.( పరారీలో వున్నారు)
ప్రాసిక్యూషన్ కు సహకరించిన విచారణ అధికారులు అప్పటి ఇన్స్పెక్టర్ P.సత్యనారాయణ రెడ్డి, ప్రస్తుత ఇన్స్పెక్టర్ ఉస్మాన్ షరీఫ్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ.శంకర్,జె. శరత్ కుమార్ రెడ్డి, ఎస్సై శ్రీనివాస్, కోర్టు కానిస్టేబుల్ జి.రవి కిషోర్, సాంబశివ రావు, కోర్టు లైజనింగ్ కె.శ్రీకాంత్ (SI)) హోంగార్డ్ ఆఫీసర్ ఎండీ.ఆయూబ్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.















