ఈతరం భారతం ఖమ్మం ఆగస్ట్ 21 :ఎర్రుపాలెం, బోనకల్, మధిర, మండలంలోని గ్రామాల్లో గణేష్ మండపాలను ఏర్పాటు చేయాలనుకునే ప్రతి ఒక్కరూ ముందుగానే పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరిగా పొందాలని సీ ఐ డి.మధు స్పష్టం చేశారు. మండపం ఏర్పాటు చేసే స్థలదాత అంగీకార పత్రం, విద్యుత్ శాఖ అనుమతి పత్రాలు తప్పనిసరిగా పోలీస్ శాఖకు సమర్పించాలన్నారు. వినాయక మండపాల వద్ద డిజె సౌండుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రజలంతా నియమ నిబంధనలను గౌరవిస్తూ పోలీస్ శాఖను సంప్రదించి మాత్రమే మండపాలు ఏర్పాటు చేయాలని సి ఐ, డి.మధు కోరారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని ఆయన హెచ్చరించారు.















