ఈతరం భారతం ఖమ్మం :ఆగస్టు 19 : ఖమ్మం టౌన్ ఫ్లవర్స్ అసోసియేషన్ నగర మహాసభ ఖమ్మం నగరంలో వివిధ ప్రాంతాల్లో ఫ్లవర్స్ అమ్మకం దారులు రెండు వందల మందితో స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రం ఏరియాలో గల పి.ఆర్.టి.యు భవన్ నందు ఘనంగా జరిగింది. ఈ మహాసభలో ఖమ్మం టౌన్ ఫ్లవర్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు గౌరవ సలహాదారులుగా షేక్.మహిమూద్, షేక్ సర్ధార్, శ్రీను, ప్రెసిడెంట్ గా షేక్. మోహిన్, యం. రామకృష్ణ, సెక్రటరీగా షేక్ .ఖాజా, జాయింట్ సెక్రటరీగా ఆర్. వెంకన్న (పీటర్), కన్వీనర్ గా యం.డి.ముజాహిద్, కో కన్వీనర్ గా సురేందర్, ట్రెజరర్ గా షేక్. షాబాజ్ లుగా ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ. ఖమ్మం నగరంలో వివిధ ప్రాంతాల్లో ఏవిధమైన ఆర్థిక స్థోమత లేక ఖమ్మం నగరంలో దేవాలయాల వద్ద, వీధుల్లో తిరిగి పూల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం చిరు వ్యాపారులుగా గుర్తించి ఆర్ధిక సహాయం అందించి ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. నగరంలో ఉన్న పూల వ్యాపారులకు నూతన కమిటీ ఎళ్ళవేళలా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డుంగ్రోత్ శేఖర్, షేక్. రంజాన్, పి.కృష్ణ వేణి, షేక్, లాల్ బీ, ఉపేందర్, వై. వినోద్ తదితరులు పాల్గొన్నారు.















