ఈతరం భారతం ఖమ్మం ఫిబ్రవరి 19;
ఖమ్మం నగరంలో శివాజీ మహారాజ్ 396 వ జయంతి శోభాయాత్ర ఘనంగా నిర్వహించామని హిందూ వాహిని జిల్లా అధ్యక్షుడు బోయిన సందీప్ తెలిపారు. హిందువులు అంతా ఐక్యంగా ఉండాలని లేనిచో, మన దేశం కూడా మరో పాకిస్థాన్, బంగ్లాదేశ్ లా తయారవుతుంది అన్నారు.శివాజీ మహారాజ్ హిందూ ధర్మము కోసం చేసిన యుద్ధాల గురించి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ శివాజీ మహారాజ్ ను ఆదర్శంగా తీసుకుని పని చేయాలని సూచించారు. ఇందు యువతలను లవ్ జిహాద్ పేరుతో పెద్ద ఎత్తున మతం మార్చుతున్నారని, దానికి అడ్డుకట్ట వేయకపోతే హిందూ ధర్మం అంతరించి పోతుందని అన్నారు. తల్లి తండ్రులు కూడా తమ పిల్లలకు హిందూ ధర్మం బోధించాలని, పిల్లలకు ధర్మం బోధించకపోతే లవ్ జిహాద్ కేసులు ఎక్కువ అవుతుంటాయన్నారు.















