EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఘోర రోడ్డు ప్రమాదం.. కాలి బూడిదైన బుల్లెట్..

ఈతరంభరతం మధిర జూలై 13 :ఎర్రుపాలెం నుండి మధిర వెళ్లే రోడ్డు మార్గంలో పెగళ్ళపాడు గ్రామ సమీపంలోని ఫ్లై ఓవర్ పై ఆదివారం కారు బుల్లెట్ ఢీకొన్న ప్రమాదంలో బుల్లెట్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.

ఎర్రుపాలెం మండల పరిధిలోని మీనవోలు గ్రామానికి చెందిన నండ్రు వెంకటేశ్వరరావు అలియాస్ జ్ఞాన ప్రకాష్(48) మధిర సెవెంత్ డే చర్చి పాస్టర్ గా పనిచేస్తున్నారు. ఎరుపాలెం నుండి మధిర వైపు బుల్లెట్ పై వెళుతున్న సమయంలో మధిర వైపు నుంచి వస్తున్న కారు బలంగా ఢీ కొనడంతో బులెట్ కాలిపోగా,వ్యక్తి మృతి చెందాడని తెలిపారు.

పెద్ద గోపవరం గ్రామానికి చెందిన శీలం శివ కృష్ణారెడ్డి కారు నడుపుతున్నారని ఇతను నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ లో సూపర్వైజర్ గా పని చేస్తున్నట్లు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. మధిర సీఐ డి రమేష్ పర్యవేక్షణలో ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా చేశారు. చనిపోయిన జ్ఞాన ప్రకాష్ సోదరుడు నండ్రు దావీదు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top