EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేసిన ఎదులాపురం మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు 

ఈతరంభరతం  16/7/2025 బుధవారం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్ నందు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ ఆధ్వర్యంలో సూర్యాపేట ఎం ఎల్ ఎ జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.నిన్న తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పై జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున ఎదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేల మంది మేలు కోరే మంచి మనసున్న పొంగులేటి.శ్రీనన్న గారి పై జగదీశ్వర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు ఇంకోసారి చేస్తే సహించేది లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.శ్రీనన్న అంచలంచెలుగా ఎదుగుతున్నది చూసి ఓర్వలేకనే దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారని దుయ్యబట్టారు.శ్రీనన్న చరిష్మా ఏంటో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు.నిత్యం ప్రజలతో మమేకమయ్యే శ్రీనన్న పై నిందలు వేయడం హేయమైన చర్య అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే జగీదీశ్వర్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని సురేష్ నాయక్ అన్నారు.ఈ కార్యక్రమంలో వారితో పాటు తెలంగాణ రాష్ట్ర ఓబీసీ సెల్ ఉపాధ్యక్షురాలు హారిక నాయుడు,ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు. ధారావత్.రామ్మూర్తినాయక్,కందుకూరు.వెంకటనారాయణ,అంబటి.సుబ్బారావు,తమ్మినేని.నవీన్,బిఅజ్మీరా.అశోక్ నాయక్,బానోత్.కిషోర్ నాయక్,వెంపటి.రవి,పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్.కిరణ్ కుమార్,పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్లు, ఎ ఎం సి డైరెక్టర్లు,మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు,అనుబంధ సంఘాల కాంగ్రెస్ నాయకులు,మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top