ఈతరం భారతం ఖమ్మం జనవరి 24
జనసేన పార్టీ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తుందనీ ఆ పార్టీ ఖమ్మం జిల్లా కో ఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ తెలిపారు. బైపాస్ రోడ్డు లోని కృష్ణా ఫంక్షన్ హాల్ లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని తెలియజేసారు.జంపు జిలానీ నేతలను కాకుండా నిబద్ధత గల యువతను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఒక పార్టీలో గెలిచి పదేళ్లు పదవులు అనుభవించి మళ్లీ మరో పార్టీలో చేరుతూ వాల్లే కోట్లు పోసి టికెట్లు కొనుక్కుంటున్నారనీ విమర్శించారు. జరగబోయే కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు గట్టి పోటీ ఇవ్వబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండారు రామకృష్ణ,మిర్యాల జగన్ మోహన్, తుడుం ఉత్తమ్ రాజు, బానోత్ దేవేందర్, షేక్ హసీనా,స్రవంత్ కన్నా రమణ కుమార్, గంగాధర్,గుండబోయిన నరేష్, దుర్గ ప్రసాద్,దినేష్ నరసింహారావు పుల్లారావు,విజయ్,హరి,వంశీ, బాణాల శ్రీకాంత్, కిషోర్ అఖిల్,వెంకన్న,సాయి కృష్ణ, నాగరాజు పాల్గొన్నారు















