ఈతరంభారతం ముదిగొండ ఆగస్టు 13 :ఖమ్మం-కోదాడ జాతీయ రహదారి పై గోకినేపల్లి గ్రామ సమీపంలోని ఫ్లై ఓవర్ వద్ద కారు పల్టీ కొట్టి ఇద్దరు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారు తెలిపిన వివరాలు ప్రకారం మృతులు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం పిండిప్రోలు గ్రామానికి చెందిన కొండబాల వెంకయ్య (64) సాయి రంజిత్ (33) అను ఇద్దరు కార్ లో నల్గొండ జిల్లాలోని దోమ చర్ల లో వారి బంధువులకు మృతుడు సాయి రంజిత్ చెల్లి పెళ్ళికి కార్డు ఇవ్వడానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ముదిగొండ మండల పరిధిలోని గోకినేపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కారు పల్టీ కొట్టి కార్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు పోలీసులు తెలియజేశారు. పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి తరలించినట్టు సీఐ మురళి తెలిపారు.















