EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జిల్లా కేంద్రంలో ఎరువుల ఫిర్యాదుల సెల్ ఏర్పాటు… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఈతరం భారతం ఖమ్మం జూలై 23 :జిల్లా కేంద్రం, కలెక్టరేట్ లో ఎరువుల ఫిర్యాదు సెల్ ను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎరువులకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు ఉన్న టోల్ ఫ్రీ నెం. 1077, సెల్ నెం. 9063211298 లకు కాల్ చేసి, ఫిర్యాదు చేయాలని కలెక్టర్ అన్నారు. ప్రస్తుత వానాకాలం 2025 సీజన్ కు సంబంధించి జిల్లాలో 3 లక్షల 80 వేల 852 ఎకరాల్లో ప్రధాన పంటలైన వరి, ప్రత్తి, అపరాలు, మొక్కజొన్న సాగులో ఉన్నాయన్నారు. వానాకాలం పంట కాలం మొత్తానికి 41 వేల మెట్రిక్ టన్నుల యూరియా, 26 వేల 464 మెట్రిక్ టన్నుల డిఏపి, 20 వేల 857 మెట్రిక్ టన్నుల ఎంఓపి, 88 వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 6 వేల 780 మెట్రిక్ టన్నుల ఎస్ఎస్పి అవసరమని అంచనా వేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో కావాల్సినంత ఎరువులు అందుబాటులో ఉన్నట్లు, ఎక్కడా ఎరువుల కొరత లేదని కలెక్టర్ తెలిపారు. ఎక్కడైనా ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే, అధిక ధరలకు అమ్మకం జరిపితే చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ హెచ్చరించారు. రైతులు తమ ఆధార్ కార్డ్ పిఓఎస్ మిషన్ ద్వారా ఎరువులు కొనుగోలు చేయాలన్నారు. ఎక్కడైనా ఎరువుల కృత్రిమ కొరత ఉన్నట్లు గమనిస్తే, అధిక ధరలకు అమ్మకం జరిపితే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి లేదా మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయాలన్నారు. కలెక్టరేట్ లో రైతుల సౌకర్యార్థం ఎరువుల ఫిర్యాదు సెల్ టోల్ ఫ్రీ నెం. 1077, సెల్ నెం. 9063211298 లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదు కొరకు సెల్ నెం. 8977741771 ని ప్రభుత్వం కేటాయించిందన్నారు.

Related News

Select the Topic
Scroll to Top