EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జేఎన్టీయూ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ అని నమ్మి జాయిన్ అయిన విద్యార్థుల పరిస్థితి గందర గోళం

ఈతరంభారతం హైదరాబాద్ జూలై 31 :విద్యార్థి ఉద్యమలు ద్యారా సాధించిన పాలేరు జేఎన్టీయూ ప్రభుత్వ ఇంజనీరింగ్ యూనివర్సిటీ మూడేళ్లవుతున్నా ఇక్కడ ఎలాంటి వసతులు లేక పక్కాభవనాలు నిర్మించలేదు. ఫ్యాకల్టీ కూడా తాత్కాలిక పద్ధతి లోనే vచదువులు సాగిస్తున్నారాని పూర్తిస్థాయి ఫ్యాకల్టీ కూడా నియమించాలేదని ల్యాబులు ఏర్పాటు చేయాలి. విద్యార్థినులకు హాస్టల్ వసతి కల్పించాలి. తాత్కా లిక ఇంజనీరింగ్ కాలేజీ భవనాన్ని పూరిస్థాయి వసతులున్న కల్పించాలని పి. డి. ఎస్. యూ జిల్లా నాయకులు స్టాలిన్, శ్రీను లు ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.

ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యూ పాలేరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మద్ధుల పల్లి JNTU H నందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ సందర్బంగా పి డి ఎస్ యూ జిల్లా నాయకులు స్టాలిన్,శ్రీను మాట్లాడుతూ గత బీఆర్ఎస్ హయాంలో 2023లో ఖమ్మం జిల్లా పాలేరు,జేఎన్టీయూ కాలేజీలు మంజూర య్యాయినా నేటికీ భవనం నిర్మాణం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలేరు జేఎన్టీయూకు సరైన భవనాలు నిర్మాణం చేయకుండానే ఐటీడీఏకు చెందింనా బిల్డింగ్ భవనంలోనే హాస్టల్, కాలేజీ తరగతుల సమస్య తో నిర్వ హిస్తున్నారాని అధికారుల పై మండి పడ్డారు. ముఖ్యం గా మహిళా విద్యార్ధిను లకు హాస్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారాని కాలేజీ ఒకచోట, హాస్టల్ మరోచోట ఉండడంతో సరైన రక్షణలేక విద్యార్థులు భయం భయం గా కాలేజీ కి వెళ్తున్న పరిస్థితి ఉంది అన్నారు.

జేఎన్టీయూ పాలకమండలి నిర్లక్ష్యంతో ఇప్పటి వరకు టెండర్ల ప్రక్రియ పూర్తికాలేదాని కావున తక్షణమే ప్రభుత్వం జిల్లా మంత్రులు స్పందించి కాలేజీ నిర్మాణం పూర్తిచేయాలనీ లేని పక్షం లో పి డి ఎస్ యూ ఉద్యమల ద్యారా పెద్ద ఎత్తున్న ఉద్యమం చేస్తాం అన్నారు.ఈ కార్యక్రమం లో పి డి ఎస్ యూ నాయకులు అలేఖ్య, అఖిల,స్పందన, కావ్య, లేఖ్య తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top