EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పదవ తరగతి విద్యార్థిని మృతి…

ఈతరం భారతం ఖమ్మం జూలై 28 :ఖమ్మం రూరల్  మండలం లోని గొల్ల గూడెంలో ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది.కూసుమంచి మండలంలోని బోటి తండా చెందిన భూక్యా ప్రతిమ (14) ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో పదవ తరగతి చదువుతోంది. సాయంత్రం స్కూల్ లో తలనొప్పిగా ఉంది అంటూ ఉపాధ్యాయులకు తెలపడంతో వారు పారాసెట్ మాల్ టాబ్లెట్ ఇచ్చారు.కొద్దిసేపటికి ఆమెకు నోట్లో నుంచి నురుగు రావడంతో టీచర్లు ఏఎన్ఎం సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి ఆమె అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. దీంతో మృతిని బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అమ్మాయిను ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించటంతో ఆమె చనిపోయిందని ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో, రూరల్ తాసిల్దార్ బంధువులతో మాట్లాడి ప్రభుత్వం నుంచి న్యాయం చేస్తామని చెప్పడంతో వారు నిరసన విరమించారు.

Related News

Select the Topic
Scroll to Top