ఈతరం భారతం ఖమ్మం ఆగస్ట్ 21 : పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలంలోని అన్నిప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నబాలికలకు ఖమ్మంజిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సైకిళ్లను పంపిణీ చేశారు. “పేద పిల్లలకు ప్రయాణ సౌకర్యం లేక చదువులో వెనుకబడకూడదనే సంకల్పంతో గతేడాది 8, 9, 10వ తరగతుల విద్యార్థినిలందరికీ సైకిళ్లు ఇచ్చాం. వచ్చే ఏడాది నుంచి జూనియర్ కళాశాలలో చేరుతున్న విద్యార్థినిలకు కూడా PSR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సైకిళ్లు అందిస్తాం అని మంత్రి తెలిపారు.















