ఈతరం భారతం ఖమ్మం ఆగస్టు 16 :ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి మధిర టౌన్ సిఐ రమేష్ ఆదేశాల మేరకు పోలీసు వారి ఆధ్వర్యంలో ఈరోజు మధిర మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. దీనిలోని భాగంగా ఆర్ వి కాంప్లెక్స్ వద్ద కానిస్టేబుల్ కొండ సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంతో ఉండాలని తెలియజేస్తూ పాంప్లెట్లను అందజేశారు. బ్యాంకుల పేరుతో మోసాలు ,అనుమానిత లింకు లేదా APK ఫైల్ మోసం, క్యూఆర్ కోడ్ మోసం, సోషల్ మీడియా వాట్సాప్, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్, డిపి స్కాం, జాబ్ మోసం, పెట్టుబడి మోసం, కస్టమర్ కేర్ మోసం, గిఫ్ట్ ,ఆన్లైన్ షాపింగ్ ప్రకటన,, డిజిటల్ అరెస్ట్ ,లోన్ యూపీఐ యాప్ వంటి సోషల్ మీడియా పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.















