ఈతరంభారతం నేలకొండపల్లి జూలై 23 :నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో భాధ్యతలు నిర్వహిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 1 మరణించిన కానిస్టేబుల్ బి. కృష్ణ కుటుంబ సభ్యులకు 8,00,000/- (ఎనిమిది లక్షల రూపాయల) భద్రత ఎక్సిగ్రేసియా చెక్కు ను బుధవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ … శాఖపరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందించేందుకైన పోలీస్ అధికారులు అందుబాటులో వుంటారని అన్నారు. పోలీసు కుటుంబాలకు అన్ని విధాల ఆదుకుంటామన్నారు.















