EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

భార్యపై మారణాయుధంతో దాడి చేసిన భర్త..తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి బాధితురాలు : సంఘటన స్థలానికి చేరుకుని విచారణ నిర్వహించిన ఎస్సై లక్ష్మీ భార్గవి

ఈతరం భారతం మధిర ఆగస్టు 24 :కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై ఆగ్రహానికి గురైన భర్త మారణాయుధంతో ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన మండల పరిధిలోని మాటూరు గ్రామం బీసీ కాలనీలో జరిగింది. శనివారం అర్ధరాత్రి జరిగినట్లుగా తెలుస్తున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చిల్లసూర్యనారాయణ ప్రైవేట్ లారీ డ్రైవర్ గా పనిచేస్తూ జీవన సాగిస్తున్నారు. అరకొర ఆర్థిక సమస్యలు కుటుంబ భారంతో భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్ధలు నేపథ్యంలో శనివారం డ్రైవర్ విధులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన భర్త సూర్యనారాయణ(32) భార్య సాయి నాగలక్ష్మి(26) తో చిన్న సమస్యపై ఘర్షణపడ్డారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన సూర్యనారాయణ అందుబాటులో ఉన్న మారణాయుదంగా ఉన్నట్లుగా గుర్తించిన వస్తువుతో భార్యపై దాడికి దిగినట్లు, ఈ దాడిలో నాగలక్ష్మి మెడపై బలమైన ఘాట్లు పడి రక్తస్రావం కావడంతో బాధితురాలు కేకలు వేసుకుంటూ ఇంట్లో నుండి రోడ్డుపైకి వచ్చి కింద పడిపోవడంతో బయటికి వచ్చిన స్థానికులు 108 అంబులెన్స్ సహాయంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నాగలక్ష్మి మెడపై బలమైన గాయం తో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంఘటన జరిగిన సమాచారాన్ని తెలుసుకున్న మధిర రూరల్ ఎస్సై లక్ష్మీ భార్గవి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని విచారణ నిర్వహించారు. స్థానికులతో ఆదివారం ఉదయం మరోసారి పరిశీలన సందర్భంగా విచారణ నిర్వహించిన ఆమె నిందితునిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సూర్యనారాయణ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ఉండగా ప్రస్తుతం నాగలక్ష్మి గర్భవతిగా ఉన్నట్లు సమాచారం. బాధితురాలు అమాయకురాలు గా అణుకువగా ఉంటుందని, సూర్యనారాయణ ఆమెపై గతంలో కూడా దాడి చేసి కొట్టినట్లు నమోదైన కేసు పోలీస్ రికార్డుల్లో ఉన్నట్లు ఈ సంఘటన అనంతరం గ్రామంలో పలు విధాలుగా చర్చించుకోవడం గమనార్హం.

Related News

Select the Topic
Scroll to Top