EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మానవ అక్రమ రవాణా నివారణ అవగాహన ద్వారానే సాధ్యం

ఈతరం భారతం ఖమ్మం జూలై 30

మానవ అక్రమ రవాణాను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే అవగాహన ద్వారానే సాధ్యమవుతుందని షీ టీం మరియు యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ ఇన్స్పెక్టర్ శివ నాగుల శ్రీనివాస్ అన్నారు మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జూలై 30 సందర్భంగా యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ మరియు పోలీస్ యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా మొత్తం బాధితులలో 26% మంది పిల్లలే అని 71 శాతం మంది మహిళలు మరియు యుక్త వయసు బాలికలు అని ఆందోళన వ్యక్తం చేశారు నిరుద్యోగులు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఉపాధి కోసం వలస వెళ్లేవారు కూడా అత్యంత ఎక్కువ ప్రమాదం లో ఉంటారని గ్రామాలలో పాఠశాలలో కమ్యూనిటీ మీటింగ్లలో ఈ అంశంపై విస్తృతంగా ప్రచారం చేయాలని చర్చలు నిర్వహించాలని అన్నారు మానవ అక్రమ రవాణా ఈ విధంగా జరుగుతుందో ఎలా అప్రమత్తంగా ఉండాలో చిన్న చిన్న స్కిట్ ల ద్వారా ఆయన బాలబాలికలను ఉత్తేజపరిచారు . ఆన్లైన్ మోసాలు వేధింపులు మరియు ఇతర సమస్యలకు డైల్ 100 లేదా 1930లకు ఫోన్ చేసి తెలిపి సహాయం పొందాలని అన్నారు

మరో అతిధి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సీఐ సురేష్ గౌడ్ మాట్లాడుతూ కౌమార దశలో ఉన్న బాలబాలికలు సామాజిక మాధ్యమాలను విరివిగా వినియోగిస్తూ తమ యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమయాన్ని సద్వినియోగం చేసుకొని సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలను అర్థం చేసుకొని చక్కగా చదివి జీవితంలో రాణించాలని పిలుపునిచ్చారు.

మరో అతిధి బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి భారతరాణి మాట్లాడుతూ విద్య ద్వారానే ఏదైనా సాధించవచ్చని సమాజంలో మంచి పౌరులుగా రాణించి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన బాధ్యతగల పౌరులుగా విద్య మాత్రమే తీర్చిదిద్దుతుందని తెలిపారు బాలల సంక్షేమ కమిటీ ద్వారా బాలలకు అందించే సేవలు గురించి వివరించారు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ఫోన్ చేసి తెలపాలన్నారు

ఏఐడీ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కె శ్రీనివాస్ మాట్లాడుతూ 2013 నుంచి ఐక్యరాజ్యసమితి జులై 30 ని మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం గా జరుగుతుందని అన్నారు. మానవ క్రమ రవాణా అనేది ప్రస్తుతం స్కాముల ద్వారా కూడా జరుగుతుందని ఆ ట్రాప్ లో ఎవరూ పడవద్దని తెలిపారు అక్రమ రవాణాకు గురైన వ్యక్తులతో పారిశ్రామిక స్థాయి సైబర్ మోసాలతో ముడిపడి ఉంటుందని నకిలీ ఉద్యోగ ఆఫర్లు నేరపూరిత బృందాలు తప్పుడు విదేశీ ఉద్యోగ ప్రకటనల ద్వారా మోసం చేస్తారని రిప్టో కరెన్సీ మరియు ఇతర స్కామ్లలో నెట్టివేయబడతారని అన్నారు మానవక్రమ రవాణా ప్రతి సంవత్సరము 236 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుందంటే తీవ్రతను అర్థం చేసుకోవాలని అన్నారు అక్రమ రవాణా బాధితులలో 38 శాతం మంది బాలలు ఉన్నారని కావున ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ అనుమానాస్పదంగా ఉంటే పోలీసు వారికి తెలియజేయాలని కోరారు

ఈ కార్యక్రమంలో ఎయిడ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కె శ్రీనివాస్ ఏ హెచ్ టి యు బాధ్యులు ఉదయ్ భాస్కర్ షీ టీం కానిస్టేబుల్ రుక్మిణి, సభ్యులు రాందాస్ రవిచంద్ర రవీంద్ర భాస్కర్, పారాలిగల్ వాలంటీరు మాధవి లత నయా బజార్ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్, అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top