EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ముగ్గురు సైబర్ నేరస్థులను అరెస్టు చేసిన ఖమ్మం సైబర్ క్రైం పోలీసులు

ఈ తరం భారతం ఖమ్మం తేదీ:25.07.2025 పీమీ ఆధార్ కార్డ్ ద్వారా సిమ్ములు తీసుకొని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు , జాబ్ ఫ్రాడ్స్ , మనీలాండరింగ్ జరిగాయని, ఈ కేసులలో అరెస్టు చేస్తామని నేతాజీ నగర్ ఖమ్మం అర్భన్ మండలం కి చెందిన రిటైర్డ్ ఉద్యోగి గారిని బెదిరించి, డిజటల్ అరెస్టు చేసి సుమారు 59 లక్షల రుపాయలు మోసం చేసిన కేసులో ముగ్గురిని ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు అనంతపురం , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరెస్టు చేసినట్లు ఖమ్మం సి.పి. సునిల్ దత్ గారు తెలిపారు. కేసు వివరాలలోకి వెళితే ఖమ్మం అర్భన్ మండలానికి చెందిన రిటైర్డ్ ఉపాద్యాయుడుని ఫోన్ లో జాబ్ ఫ్రాడ్స్ , మనీలాండరింగ్ కి పాల్పడ్డారని, బెంగళూరు పోలీసులమని, డిజిటల్ అరెస్టు చేస్తామని బెదిరించి ఏప్రిల్-2025 లో ఫలుదఫాలుగా సుమారు 59 లక్షలు రూపాయలు దోచుకున్న కేసులో రూ. 9 లక్షలు అకౌంట్ కి వెళ్ళిన D. యెర్రి స్వామి, వయస్సు 35 సం,లును అరెస్ట్ చేసి విచారించగా తను మరియు ఇంకో ఇద్దరు E. లక్ష్మానాయక్ , వయస్సు 35 సం” లు మరియు కె .నారాయణ రెడ్డి, వయస్సు 49 సం” లు కలిసి నేరం చేసినట్లు ఒప్పుకున్నారు . అట్టి ముగ్గురిని అనంతపురం లో అరెస్ట్ చేసినట్లు, ముగ్గురు నిందితులను ఖమ్మం సైబర్ క్రైం కోర్టులో హాజరు పరచి, రిమాండ్ కి తరలించారని తెలిపారు. ఈ కేసు విచారణలో ముఖ్య పాత్ర వహించి, ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం లో నిందుతుల్ని అరెస్టు చేసి, ఖమ్మంకి తీసువచ్చి, రిమాండ్ చేసిన సైబర్ క్రైం ఇన్- ఛార్జి డి.ఎస్పి. T. లక్ష్మినారాయణ గారికి, ఇన్పెక్టర్ యాసిన్ అలీ గారిని, ఎస్సైలు రంజితకుమార్, సహకరించిన ఎస్సై విజయ్ కుమార్ మరియు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఖమ్మం సి.పి.  అభినందించారు.

Related News

Select the Topic
Scroll to Top