ఈతరం భారతం ఖమ్మం జూలై 30 ;ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో కాలనీలు గ్రామాలలో అనేక సమస్యలతోని ఉద్యోగులు ప్రజలు సతమతమవుతున్నారు గత దశాబ్ద కాలంగా ఏదులాపురం పరిధిలో గృహాలు నిర్మించుకున్న ఆవాస ప్రాంత ప్రజలు కనీస మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. సిసి రోడ్లు డ్రైనేజీలు మంచినీటి సౌకర్యం పారిశుధ్య సమస్యలతో అలాగే మౌలిక వసతులైన రైతు బజార్ గ్రంథాలయము స్టేడియం సెంట్రల్ లైటింగ్ పార్కులు జిమ్ ,ముక్క పురుగుల సమస్య తదితర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు .ఈ క్రమంలో సమస్యలు పరిష్కరించుకొనుటకు గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి కమిషనర్ ఆల శ్రీనివాస్ రెడ్డి గారులను కలిసి కొన్ని సమస్యలను పరిష్కరించుకున్నాము మరికొన్ని సమస్యలను పరిష్కరించుకోవలసి ఉంది.ఈ నేపథ్యంలో వివిధ కాలనీలో నివసిస్తున్న ఉద్యోగులను సమైక్యపరిచి సంఘటితమవుటకు ఉద్యోగుల సమ్మేళనాన్ని మూడవ తేదీన టిసివి రెడ్డి ఫంక్షన్ హాల్ నందు ఉదయం 10 గంటలకు ఉద్యోగుల సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాము
ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి గారు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారు కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారు ఉద్యోగ జేఏసీ నాయకులు ఏలూరు శ్రీనివాసరావు గారు గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గారు సమాచార హక్కు చట్టం కమిషనర్ పివీ శ్రీనివాసరావు గారు ఎమ్మార్వో రాంప్రసాద్ నియోజకవర్గ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు పాల్గొంటున్నారు కావున ఈ సమ్మేళనంలో ఉద్యోగులు కుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయగలరని కోరుచున్నాము అని చెప్పారు.ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఉద్యోగ జేఏసీ అధ్యక్షులు ఎస్ విజయ్ ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాస్ గౌరవాధ్యక్షుల. ఉడుగు వెంకటేశ్వర్లు అసోసియేటెడ్ అధ్యక్షులు శోభన్ కిషన్ నాయక్ ధరావత్ రాములు జైపాల్ గౌరవ సలహాదారులు రామ్ నాయక్ ప్రసాదరావు గంధసిరి మల్లయ్య పి.వెంకటేశ్వరరావు జైపాల్ తదితరులు పాల్గొన్నారు















