EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మేడారం జాతరతో ఖమ్మం ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం

ఈతరం భారతం ములుగు ఫిబ్రవరి

మేడారం సమ్మక్క–సారక్క జాతర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) ఖమ్మం రీజియన్‌కు గణనీయమైన ఆదాయం లభించింది. ఈ జాతర ప్రత్యేక ఏర్పాట్లలో భాగంగా ఖమ్మం ఆర్టీసీకి మొత్తం రూ.3,28,39,181 ఆదాయం వచ్చినట్లు టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రిజినల్ మేనేజర్ సరి రామ్ వెల్లడించారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఖమ్మం, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు డిపోల నుంచి మేడారంకు ప్రత్యేకంగా 214 బస్సు సర్వీసులు నడిపారు. ఈ బస్సులు మొత్తం 2040 ట్రిప్పులు నిర్వహించగా, 2,03,863 మంది భక్తులు ఆర్టీసీ బస్సుల ద్వారా మేడారంకు చేరుకున్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో బస్సు సర్వీసులు ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులు ఆర్టీసీ సేవలను విస్తృతంగా వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు సర్వీసులు, సిబ్బంది నియామకం, పర్యవేక్షణ చర్యలు చేపట్టడంతో జాతర కాలం మొత్తం ప్రయాణం సజావుగా సాగిందన్నారు.

Related News

Select the Topic
Scroll to Top