ఈ తరం భారతం ఖమ్మం ఆగస్టు 16 : ఖమ్మం మున్నేరుకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 14 అడుగులకు చేరింది. వర్షాలు కొనసాగుతున్నందున వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మున్నేరులో నీటిమట్టం 16 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మున్నేరు పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.14 అడుగులకు చేరిన మున్నేరు, 16 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.















