ఈతరం భారతం ఖమ్మం ఆగస్టు 6 :దివ్యాంగులకు సదరమ్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్ తెలిపారు. 3 7, 12, 14, 19, 21, 23, 26, 28, 302 తేదీల్లో క్యాంపులు ఉంటాయని వెల్లడించారు. నిర్ణీత తేదీల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వైకల్య పరీక్షలు నిర్వహించ నున్నట్లు తెలిపారు. దివ్యాంగులు స్లాట్ బుక్ చేసుకున్న రశీదుతో పాటు ఆధార్ కార్డ్ జిరాక్స్,పాస్పోర్ట్ సైజ్ ఫొటో, వైద్యపరీక్షల రిపోర్టులతో హాజరుకావాలని సూచించారు.















