ఈతరం భారతం ఖమ్మం ఆగస్టు 18 :విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన రూరల్ మండలంలో చోటుచేసుకుంది. రూరల్ సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. రూరల్ మండలం కరుణగిరి టీఎన్జీవోస్ కాలనీలో దేవరకొండ అనిల్ కుమార్(41) వాటర్ ప్లాంట్ రన్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.రోజు లాగానే సోమవారం వాటర్ ప్లాంట్ వద్దకు వెళ్లేందుకు స్నానం చేసేందుకు ఇంట్లో ఉన్న వాటర్ హిటర్ ప్లగ్ లో పెట్టాడు. ప్రమాదవశాత్తు వాటర్ హిటర్కు విద్యత్ప్రసరణ జరగడంతో అనిల్ షాక్‌తో కిందపడి అక్కడిక్కడే మృతి చెందాడు.ఉదయం లేచిన భార్య శైలజ బాత్రూం వద్దకు వెళ్లగా కిందపడిపోయి ఉన్న భర్త అనిల్ కుమార్ ని చూసి భయంతో కుమారులకు విషయం తెలిపింది. వెంటనే కుమారుడు శరత్ కుమార్ వచ్చి స్వీచ్ ఆఫ్ చేసి తండ్రి చేతిలో ఉన్న హీటర్‌ను తీసివేశారు. బందువులు సహాయంతో అనిల్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి భార్య శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎమ్. రాజ తెలిపారు.















