ఖమ్మం, జూలై -22: ఈతరం భారతం :విపత్తు నిర్వహణ కోసం జిల్లా కేంద్రం, కలెక్టరేట్ నందు 1077 టోల్ ఫ్రీ నెంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.వర్షాకాలం ను దృష్టి లో వుంచుకొని జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ (గ్రౌండ్ ఫ్లోర్ జి-13) నందు 24 గంటల పాటు జిల్లా రెవెన్యూ అధికారి పర్యవేక్షణలో, సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో పనిచేస్తుందని, 3 షిఫ్టులలో సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపారు. సహాయ, సహకారాల కోసం వచ్చిన కాల్ కు అధికారులు వెంటనే స్పందించి, తగు చర్యలు తీసుకుంటారని కలెక్టర్ అన్నారు. వరదలు, ఇతర విపత్తుల నేపథ్యంలో ఎటువంటి సహాయ, సహకారాలు అవసరం ఉన్నా లేదా ఎవరైనా ఎటువంటి ఆపదలో చిక్కుకున్నా, ఏదైనా ముఖ్యమైన సమాచారం జిల్లా యంత్రాంగానికి అందించాలన్నా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1077 కు ఫోన్ చేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.















