EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ పోలీస్ సంక్షేమ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల వైద్య సంరక్షణ కోసం వైద్యాశాల సౌకర్యం

ఈతరం భారతం .02.08.2025 శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ హైస్కూల్ ఖమ్మం:

శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ పోలీస్ సంక్షేమ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల వైద్య సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన (ఇన్ఫర్మేరీ రూమ్) వైద్యాశాల గదిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గారితో కలసి స్కూల్ చైర్ పర్సన్ నిష్టాశర్మ ప్రారంభించారు.

ఈ సందర్బంగా స్కూల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ… పాఠశాలలో నాణ్యమైన విద్యకోసం అందిస్తున్న సదుపాయాలతో పాటుపాఠశాల సమయంలో చిన్న గాయాలు, ఆకస్మిక అనారోగ్య సమస్యలు, మెడికల్ అత్యవసర పరిస్థితులలో విద్యార్థులు ప్రాథమిక వైద్య సహాయం పొందే ముఖ్యమైన సౌకర్యాన్ని స్కూల్ అవరణలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కార్యక్రమంలో అడిషనల్ డిసిపి కుమారస్వామి,. ఏ ఆర్ ఏసీపీ నర్సయ్య, ఆర్ ఐ కామరాజు, యూనిట్ డాక్టర్ వేణుమాధవ్, స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రాజు పాల్గొన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top